← Joshua (12/24) → |
1. | ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా |
2. | అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న |
3. | అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. |
4. | ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను |
5. | హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు. |
6. | యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను. |
7. | యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. |
8. | మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు |
9. | బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, |
10. | హెబ్రోను రాజు, యర్మూతు రాజు, |
11. | లాకీషు రాజు, ఎగ్లోను రాజు, |
12. | గెజెరు రాజు, దెబీరు రాజు, |
13. | గెదెరు రాజు, హోర్మా రాజు, |
14. | అరాదు రాజు, లిబ్నా రాజు, |
15. | అదుల్లాము రాజు, మక్కేదా రాజు, |
16. | బేతేలు రాజు, తప్పూయ రాజు, |
17. | హెపెరు రాజు, ఆఫెకు రాజు, |
18. | లష్షారోను రాజు, మాదోను రాజు, |
19. | హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, |
20. | అక్షాపు రాజు, తానాకు రాజు, |
21. | మెగిద్దో రాజు, కెదెషు రాజు. |
22. | కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, |
23. | గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, |
24. | ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి. |
← Joshua (12/24) → |