← John (7/21) → |
1. | అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. |
2. | యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక |
3. | ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. |
4. | బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కన బరచుకొనుమని చెప్పిరి. |
5. | ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. |
6. | యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. |
7. | లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. |
8. | మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. |
9. | ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. |
10. | అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. |
11. | పండుగలో యూదులుఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. |
12. | మరియు జనసమూహము లలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; |
13. | అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. |
14. | సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. |
15. | యూదులు అందుకు ఆశ్చర్య పడిచదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. |
16. | అందుకు యేసునేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. |
17. | ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును. |
18. | తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు. |
19. | మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. |
20. | అందుకు జనసమూహమునీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా |
21. | యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు. |
22. | మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు. |
23. | మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి? |
24. | వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. |
25. | యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకు వాడు ఈయనే కాడా? |
26. | ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? |
27. | అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి. |
28. | కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. |
29. | నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. |
30. | అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు. |
31. | మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. |
32. | జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. |
33. | యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; |
34. | మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. |
35. | అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా? |
36. | నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. |
37. | ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. |
38. | నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. |
39. | తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. |
40. | జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; |
41. | మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? |
42. | క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. |
43. | కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. |
44. | వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. |
45. | ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడువారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా |
46. | ఆ బంట్రౌతులుఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి. |
47. | అందుకు పరిసయ్యులుమీరుకూడ మోస పోతిరా? |
48. | అధి కారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? |
49. | అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. |
50. | అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. |
51. | అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా |
52. | వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. |
53. | అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి. |
← John (7/21) → |