| ← Job (27/42) → |
| 1. | యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను |
| 2. | నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటనుబట్టియుదేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు |
| 3. | నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు |
| 4. | నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదునా నాలుక మోసము నుచ్చరించుటలేదు. |
| 5. | మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతనువిడువను. |
| 6. | నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు. |
| 7. | నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక. |
| 8. | దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? |
| 9. | వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా? |
| 10. | వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? |
| 11. | దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. |
| 12. | మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు? |
| 13. | దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము |
| 14. | వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. |
| 15. | వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. |
| 16. | ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను |
| 17. | వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. |
| 18. | పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు. |
| 19. | వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు. |
| 20. | భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును. |
| 21. | తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును |
| 22. | ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. |
| 23. | మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. |
| ← Job (27/42) → |