| ← Job (26/42) → |
| 1. | అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను |
| 2. | శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? |
| 3. | జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?సంగతిని ఎంత చక్కగా వివరించితివి? |
| 4. | నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది? |
| 5. | జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు. |
| 6. | ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నదినాశనకూపము బట్టబయలుగా నున్నది. |
| 7. | శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెనుశూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. |
| 8. | వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. |
| 9. | దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. |
| 10. | వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను. |
| 11. | ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును |
| 12. | తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును. |
| 13. | ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును.ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను. |
| 14. | ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు? |
| ← Job (26/42) → |