← Isaiah (33/66) → |
1. | దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు. |
2. | యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుమ్‌ు ఉదయకాలమున వారికి బాహువుగానుఆపత్కాలమున మాకు రక్షణాధారముగానుఉండుము. |
3. | మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. |
4. | చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ బడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు |
5. | యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను. |
6. | నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము. |
7. | వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు. |
8. | రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన పరచెను నరులను తృణీకరించెను. |
9. | దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొను చున్నవి. |
10. | యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. |
11. | మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది. |
12. | జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును. |
13. | దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి. |
14. | సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును? |
15. | నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. |
16. | పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. |
17. | అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును. |
18. | నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? |
19. | నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. |
20. | ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు. |
21. | అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు. |
22. | యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. |
23. | నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు. |
24. | నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. |
← Isaiah (33/66) → |