← Isaiah (26/66) → |
1. | ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. |
2. | సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. |
3. | ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. |
4. | యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. |
5. | ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు |
6. | కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి. |
7. | నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని |
8. | మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది. |
9. | రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. |
10. | దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. |
11. | యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. |
12. | యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. |
13. | యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము |
14. | చచ్చినవారు మరల బ్రదుకరు ప్రేతలు మరలలేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండ నీవు వారిని తుడిచి వేసితివి. |
15. | యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. |
16. | యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి |
17. | యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనలచేత మొఱ్ఱపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. |
18. | మేము గర్భము ధరించి వేదనపడితివిు గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతివిు లోకములో నివాసులు పుట్టలేదు. |
19. | మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. |
20. | నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చు చున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. |
21. | నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము. |
← Isaiah (26/66) → |