← Genesis (46/50) → |
1. | అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. |
2. | అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడుయాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుక తడుచిత్తము ప్రభువా అనెను. |
3. | ఆయననేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడనిన్ను గొప్ప జనముగా చేసెదను. |
4. | నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చె దను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసి కొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా |
5. | యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి యైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. |
6. | వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి. |
7. | అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను. |
8. | యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే; |
9. | యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ. |
10. | షిమ్యోను కుమారులైన యెమూ యేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయు రాలి కుమారుడైన షావూలు. |
11. | లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి |
12. | యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు. |
13. | ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను. |
14. | జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహ లేలు. |
15. | వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు. |
16. | గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ. |
17. | ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరి యైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు. |
18. | లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను. |
19. | యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. |
20. | యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. |
21. | బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు. |
22. | యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. |
23. | దాను కుమారుడైన హుషీము. |
24. | నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము. |
25. | లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు. |
26. | యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. |
27. | ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తు నకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది. |
28. | అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా |
29. | యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను. |
30. | అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతోనీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. |
31. | యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచినేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి; |
32. | ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱల కాపరులు. వారు తమ గొఱ్ఱలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పె దను. |
33. | గొఱ్ఱల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల |
34. | మీరు గోషెను దేశమందు కాపురముండునట్లుమా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గల వారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను. |
← Genesis (46/50) → |