← Genesis (38/50) → |
1. | ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను. |
2. | అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను. |
3. | ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. |
4. | ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. |
5. | ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీ బులోనుండెను. |
6. | యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. |
7. | యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. |
8. | అప్పుడు యూదా ఓనానుతోనీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను. |
9. | ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. |
10. | అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను. |
11. | అప్పుడు యూదాఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొనినా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట |
12. | చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను |
13. | దాని మామ తన గొఱ్ఱల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను. |
14. | అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన |
15. | యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని |
16. | ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియకనీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామెనీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. |
17. | అందుకతడునేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. |
18. | అతడునేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమెనీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి |
19. | అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను. |
20. | తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కన బడలేదు. |
21. | కాబట్టి అతడుమార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారుఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి. |
22. | కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లిఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులుఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అని నప్పుడు |
23. | యూదామనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. |
24. | రమారమి మూడు నెలలైన తరువాతనీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదాఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను. |
25. | ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపిఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. |
26. | యూదా వాటిని గురుతు పట్టినేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పు డును ఆమెను కూడలేదు. |
27. | ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. |
28. | ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టిఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. |
29. | అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. |
30. | తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. |
← Genesis (38/50) → |