← Genesis (30/50) → |
1. | రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతోనాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను. |
2. | యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడునేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. |
3. | అందు కామెనా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి |
4. | తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా |
5. | బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. |
6. | అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. |
7. | రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. |
8. | అప్పుడు రాహేలుదేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. |
9. | లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. |
10. | లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా |
11. | లేయాఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. |
12. | లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా |
13. | లేయా నేను భాగ్యవంతురా లనుస్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. |
14. | గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా |
15. | ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలుకాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. |
16. | సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయినీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. |
17. | దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భ వతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను. |
18. | లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శా ఖారు అను పేరు పెట్టెను. |
19. | లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. |
20. | అప్పుడు లేయాదేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేం |
21. | ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. |
22. | దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. |
23. | అప్పుడామె గర్భవతియై కుమా రుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను. |
24. | మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. |
25. | రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతోనన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను. |
26. | నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను. |
27. | అందుకు లాబాను అతనితోనీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. |
28. | మరియు అతడునీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను. |
29. | అందుకు యాకోబు అతని చూచినేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును; |
30. | నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభి వృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందు ననెను. |
31. | అప్పుడ తడునేను నీకేమి ఇయ్యవలెనని యడిగి నందుకు యాకోబునీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. |
32. | నేడు నేను నీ మంద అంత టిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱను, గొఱ్ఱపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును. |
33. | ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చి నప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. |
34. | అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను. |
35. | ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱపిల్లలలో నల్లవాటి నన్నిటిని వేరుచేసి తన కుమారుల చేతి కప్పగించి |
36. | తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను. |
37. | యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి |
38. | మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా |
39. | మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. |
40. | యాకోబు ఆ గొఱ్ఱపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. |
41. | మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. |
42. | మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బల మైనవి యాకోబు నకును వచ్చెను. |
43. | ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధి కముగా అభివృద్ధిపొంది విస్తార మైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను. |
← Genesis (30/50) → |