← Amos (5/9) → |
1. | ఇశ్రాయేలువారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. |
2. | కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువా డొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది. |
3. | ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలు వారిలో వెయ్యిమందియై బయలు వెళ్లిన పట్టణస్థు లలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు. |
4. | ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. |
5. | బేతేలును ఆశ్రయింపకుడి, గిల్‌గా లులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. |
6. | యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పి వేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును. |
7. | న్యాయమును అన్యాయ మునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా, |
8. | ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చు వాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు. |
9. | ఆయన పేరు యెహోవా; బలా ఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. |
10. | అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థ ముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. |
11. | దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన |
12. | మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోర మైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. |
13. | ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. |
14. | మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. |
15. | కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును. |
16. | దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగానేను మీ మధ్య సంచరింపబోవు చున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. |
17. | ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును. |
18. | యెహోవా దినము రావలెనని ఆశపెట్టు కొనియున్న వారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము. |
19. | ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగు బంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచి నట్టు ఆ దినముండును. |
20. | యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా? |
21. | మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. |
22. | నాకు దహనబలులను నైవేద్య ములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. |
23. | మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. |
24. | నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి. |
25. | ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? |
26. | మీరు మీ దేవతయైన మోలెకు గుడార మును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా. |
27. | కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యముల కధిపతియగు దేవుడు. |
← Amos (5/9) → |