2Samuel (9/24)  

1. యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడి గెను.
2. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజుసీబావు నీవేగదా అని అడుగగా అతడునీ దాసుడనైన నేనే సీబాను అనెను.
3.  రాజుయెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.
4.  అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.
5. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.
6. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.
7. అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా
8. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.
9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపిసౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి యున్నాను;
10. కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికిభోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెల విచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.
11. నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయుచుండెను.
12. మెఫీ బోషెతునకు ఒకచిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.
13. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.

  2Samuel (9/24)