← 2Samuel (23/24) → |
1. | దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే. |
2. | యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడుఆయన వాక్కు నా నోట ఉన్నది. |
3. | ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు.మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును. |
4. | ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును. |
5. | నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. |
6. | ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. |
7. | ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు. |
8. | దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను. |
9. | ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారు డైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రా యేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి |
10. | చేయి తివిు్మరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీ యులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి. |
11. | ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారు డైన షమ్మా;ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగాజనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి. |
12. | అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను. |
13. | మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి, |
14. | దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లె హేములో ఉండిరి. |
15. | దావీదుబేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా |
16. | ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసియెహోవా, నేను ఇవి త్రాగను; |
17. | ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. |
18. | సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు. |
19. | ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. |
20. | మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను. |
21. | ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను. |
22. | ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది |
23. | ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. |
24. | ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, |
25. | హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, |
26. | పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా, |
27. | అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి, |
28. | అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై |
29. | నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, |
30. | పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి, |
31. | అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, |
32. | షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను, |
33. | హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీ యాము, |
34. | మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతో పెలు కుమారుడగు ఏలీయాము, |
35. | కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, |
36. | సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, |
37. | అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను. |
38. | ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, |
39. | హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు. |
← 2Samuel (23/24) → |