← 2Chronicles (11/36) → |
1. | రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రా యేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్ష యెనుబది వేలమందిని సమకూర్చగా |
2. | దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను |
3. | నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము |
4. | ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహో దరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి. |
5. | రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. |
6. | అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, |
7. | శోకో, అదుల్లాము, గాతు, |
8. | మారేషా, జీపు, అదోర యీము, |
9. | లాకీషు, అజేకా, |
10. | జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశము లందుండు ప్రాకారపురములను కట్టించి |
11. | దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను. |
12. | మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంత మైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి. |
13. | ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. |
14. | యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. |
15. | యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. |
16. | వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. |
17. | దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. |
18. | రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె యగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెమ. |
19. | అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి. |
20. | పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను. |
21. | రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమా రులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్ను లందరికంటెను అబ్షా లోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. |
22. | రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను. |
23. | అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధి పతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను. |
← 2Chronicles (11/36) → |