← 1Chronicles (8/29) → |
1. | బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, |
2. | మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా. |
3. | బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు |
4. | అబీషూవ నయమాను అహోయహు |
5. | గెరా షెపూపాను హూరాము |
6. | ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి; |
7. | నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను. |
8. | వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక |
9. | తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును |
10. | యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి. |
11. | హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను. |
12. | ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను. |
13. | బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి. |
14. | అహ్యోషాషకు యెరేమోతు |
15. | జెబద్యా అరాదు ఏదెరు |
16. | మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు. |
17. | జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు |
18. | ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. |
19. | యాకీము జిఖ్రీ జిబ్ది |
20. | ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు. |
21. | అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు. |
22. | ఇష్పాను ఏబెరు ఎలీయేలు |
23. | అబ్దోను జిఖ్రీ హానాను |
24. | హనన్యా ఏలాము అంతోతీయా |
25. | ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు. |
26. | షంషెరై షెహర్యా అతల్యా |
27. | యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు. |
28. | వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి. |
29. | గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా; |
30. | ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు |
31. | గెదోరు అహ్యో జెకెరు అనువారు. |
32. | మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి. |
33. | నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను. |
34. | యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను. |
35. | మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు. |
36. | ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను. |
37. | మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు. |
38. | ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు. |
39. | అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు. |
40. | ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు. |
← 1Chronicles (8/29) → |