← 1Chronicles (6/29) → |
1. | లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి. |
2. | కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. |
3. | అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. |
4. | ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను, |
5. | అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, |
6. | ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను, |
7. | మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, |
8. | అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, |
9. | అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను, |
10. | యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. |
11. | అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, |
12. | అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, |
13. | షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను, |
14. | అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను. |
15. | యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. |
16. | లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి. |
17. | గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ. |
18. | కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు. |
19. | మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా |
20. | గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, |
21. | జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి. |
22. | కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, |
23. | అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, |
24. | అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. |
25. | ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు. |
26. | ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు, |
27. | నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా. |
28. | సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు. |
29. | మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా |
30. | ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. |
31. | నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే. |
32. | సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి. |
33. | ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు |
34. | సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను, |
35. | తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను, |
36. | అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను, |
37. | జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, |
38. | కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. |
39. | హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, |
40. | షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు,బయశేయా మల్కీయా కుమారుడు, |
41. | మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు, |
42. | అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు, |
43. | షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. |
44. | మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు, |
45. | హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు, |
46. | హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు, |
47. | షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. |
48. | వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. |
49. | అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను. |
50. | అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ, |
51. | అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య, |
52. | జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, |
53. | అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. |
54. | అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి. |
55. | యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. |
56. | అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. |
57. | అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు, |
58. | హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, |
59. | ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు. |
60. | మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు. |
61. | కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను. |
62. | గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను. |
63. | మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను. |
64. | ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి. |
65. | వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. |
66. | కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. |
67. | ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును, |
68. | యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును, |
69. | అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను. |
70. | మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. |
71. | మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, |
72. | ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, |
73. | రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, |
74. | ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, |
75. | హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు; |
76. | నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను. |
77. | మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు, |
78. | యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, |
79. | కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, |
80. | గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, |
81. | హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను. |
← 1Chronicles (6/29) → |