← 1Chronicles (24/29) → |
1. | అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. |
2. | నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి. |
3. | దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. |
4. | వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి. |
5. | ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి. |
6. | లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను. |
7. | మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు, |
8. | మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు, |
9. | అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, |
10. | ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, |
11. | తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, |
12. | పండ్రెండవది యాకీమునకు, |
13. | పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు, |
14. | పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు, |
15. | పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, |
16. | పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, |
17. | ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, |
18. | ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను. |
19. | ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను. |
20. | శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును, |
21. | రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, |
22. | ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, |
23. | హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును, |
24. | ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును, |
25. | ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, |
26. | మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. |
27. | యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. |
28. | మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. |
29. | కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. |
30. | మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు. |
31. | వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి. |
← 1Chronicles (24/29) → |