← 1Chronicles (23/29) → |
1. | దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను. |
2. | మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను. |
3. | అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు. |
4. | వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. |
5. | నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. |
6. | గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి. |
7. | లద్దాను కుమారులు ముగ్గురు; |
8. | పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు |
9. | షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు. |
10. | యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు. |
11. | యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమా రులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి. |
12. | కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు. |
13. | అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధ మైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యే కింపబడిరి. |
14. | దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి. |
15. | మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు. |
16. | గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. |
17. | ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి. |
18. | ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. |
19. | హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు. |
20. | ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు. |
21. | మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు. |
22. | ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి. |
23. | మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు. |
24. | వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి. |
25. | ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు |
26. | లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. |
27. | దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి. |
28. | వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును, |
29. | సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును, |
30. | అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. |
31. | సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, |
32. | యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను. |
← 1Chronicles (23/29) → |