← 1Chronicles (14/29) → |
1. | తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను. |
2. | తన జనులగు ఇశ్రా యేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీ యులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను. |
3. | పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను. |
4. | యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను |
5. | ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు |
6. | నోగహు నెపెగు యాఫీయ |
7. | ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు. |
8. | దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. |
9. | ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి. |
10. | ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవాపొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెల విచ్చెను. |
11. | వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము2 అను పేరుపెట్టెను. |
12. | వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను. |
13. | ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా |
14. | దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి |
15. | కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను. |
16. | దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి. |
17. | కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనుల కందరికి కలుగజేసెను. |
← 1Chronicles (14/29) → |